Sat Dec 21 2024 15:52:18 GMT+0000 (Coordinated Universal Time)
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్ !
డిజిటల్ రీకార్డ్స్ ,కాల్ డేటా, ఎఫ్ఎస్ఎల్ నివేదిక లను ఈడీ కి అందించినట్లు తెలిపింది ప్రభుత్వం. ఈడీ అడిగిన వివరాలు..
హైదరాబాద్ : టాలీవుడ్ డ్రగ్స్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ తో ముందుకొచ్చింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి.. రాష్ట్ర ప్రభుత్వం ఈడీ అడిగిన అన్ని వివరాలను ఇచ్చేసింది. డిజిటల్ రీకార్డ్స్ ,కాల్ డేటా, ఎఫ్ఎస్ఎల్ నివేదిక లను ఈడీ కి అందించినట్లు తెలిపింది ప్రభుత్వం. ఈడీ అడిగిన వివరాలు ఇచ్చినట్లు హైకోర్టు రిజిస్టర్ కు మెమో దాఖలు చేసింది ప్రభుత్వం.
అయితే గతంలో సీఎస్ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్పరాజ్ అహ్మద్ పై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది ఈడీ. ప్రభుత్వం మెమోతో కోర్టు ధిక్కరణ పిటిషన్ ను వెనక్కి తీసుకుంది ఈడీ. ప్రభుత్వం నుంచి అన్ని ఆధారాలు లభించడంతో ఈడీ డ్రగ్స్ కేసు విచారణను వేగవంతం చేయనుంది. ప్రభుత్వం , ఎక్సైజ్ శాఖ ఇచ్చిన డిజిటల్ రీకార్డ్స్, కాల్ డేటా ను పరిశీలించి, మరోసారి సినీ ప్రముఖులను విచారించనుంది. డ్రగ్స్ లావాదేవీలు, డ్రగ్స్ కొనుగోళ్లు,మనీ ల్యాండరింగ్ అంశాలపై కూపీ లాగనుంది.
Next Story