Mon Dec 23 2024 01:12:42 GMT+0000 (Coordinated Universal Time)
శోభనం వీడియోని నెట్టింట్లో పెట్టిన పెళ్లికొడుకు.. అత్త ఫిర్యాదుతో ?
కాట్రేనికోన మండలంలోని ఓ తీర ప్రాంత గ్రామంలో ఈ ఘటన జరిగింది. సదరు యువకుడి వయసు 20 సంవత్సరాలు. ఫిబ్రవరి 8న..
సోషల్ మీడియా వాడకం.. జనాలను వింత పోకడలకు ప్రేరేపిస్తోంది. మితిమీరి చేస్తోన్న పనుల వల్ల ఊహించని పరిణామాలు ఎదుర్కొంటున్నా.. కొందరిలో మార్పు రావట్లేదు. గుట్టుగా చేయాల్సిన కాపురాన్ని పబ్లిక్ పెట్టి అల్లరిపాలవుతున్నారు. లైక్ లు, షేర్ లు, ఫాలోవర్ల కోసం ఎంతకైనా దిగజారేందుకు వెనుకాడట్లేదు. ఇటీవల లైక్ ల కోసం సోషల్ మీడియాలో తమ ఫస్ట్ నైట్ వీడియోను పెట్టి ఓ జంట తీవ్ర విమర్శల పాలైంది. ఇప్పుడు అదే తరహా ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోనూ చోటుచేసుకుంది. తొలిరాత్రి నవ దంపతులు ఏకాంతంగా గడిపిన క్షణాలను భర్త గుట్టుగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఘటన ఏపీలో కలకలం రేపింది.
కాట్రేనికోన మండలంలోని ఓ తీర ప్రాంత గ్రామంలో ఈ ఘటన జరిగింది. సదరు యువకుడి వయసు 20 సంవత్సరాలు. ఫిబ్రవరి 8న అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికతో పెద్దలు వివాహం జరిపించారు. ఆ తర్వాత తంతులో భాగంగా.. కార్యం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో యువకుడు భార్యతో గడిపిన తొలిరాత్రి దృశ్యాలను వీడియో తీసి, దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయం బాలిక తల్లికి తెలిసింది. ఫిబ్రవరి 20న అల్లుడు చేసిన నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 28న ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా.. 14 రోజులపాటు రిమాండ్ విధించారు. విషయం తెలియగానే ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా.. అధికారపార్టీకి చెందిన గ్రామపెద్దలు రహస్యంగా పంచాయతీ చేశారని సమాచారం.
Next Story