Tue Nov 26 2024 03:17:56 GMT+0000 (Coordinated Universal Time)
ప్రాణాలు తీసుకున్న నిమ్మకాయల చిన్నా.. ప్రేయసి కూడా.!
ప్రేమించిన వాళ్లు లోకంలో లేకపోతే తాము కూడా ఈ లోకంలో ఉండమని చెప్పి
ప్రేమించిన వాళ్లు లోకంలో లేకపోతే తాము కూడా ఈ లోకంలో ఉండమని చెప్పి కఠోర నిర్ణయాలు తీసుకునే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలాంటి ఘటనే ఒకటి యానాంలో చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి ప్రాణాలు వదిలాడని ఆ అమ్మాయి కూడా ప్రాణాలు తీసుకున్న ఘటన యానాంలో చోటు చేసుకుంది.
మీసాల మౌనిక అనే అమ్మాయి రెండేళ్లుగా కురసాంపేటకు చెందిన నిమ్మకాయల చిన్నాతో ప్రేమలో ఉంది. చిన్నా గంజాయికి బానిసయ్యాడు. రెండు నెలల క్రితం అతడు తన సోదరుడిని గంజాయి కోసం రూ.500 అడగ్గా అతడు నిరాకరించాడు. క్షణికావేశానికి లోనైన చిన్నా ఒంటికి నిప్పంటించుకున్నాడు. కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ప్రియుడు దూరమవడంతో మౌనిక తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. కాలేజీకి వెళ్లడం కూడా మానేసింది. తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఆమె అతడి లోకంలో లేనంటూ.. సోమవారం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యానాంలోని యూకేవీనగర్కు చెందిన మౌనిక తన మేనమామ త్రిమూర్తులు వద్ద ఉంటూ నర్సింగ్ విద్య చదువుకుంటోంది. ఆమె తల్లిదండ్రులు పదేళ్ల క్రితం చనిపోయారు. అక్క, చెల్లెళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి. ఈమె చిన్నాను పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఇంతలో ఇద్దరి జీవితంలో ఇలాంటి దారుణం చోటు చేసుకుంది. త్రిమూర్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్ట్మార్టం జరిపించి బంధువులకు అప్పగించారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Next Story