Mon Dec 23 2024 15:01:09 GMT+0000 (Coordinated Universal Time)
దుగ్గిరాల మహిళపై అత్యాచారం జరగలేదు : గుంటూరు ఎస్పీ
ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళతో వెంకట సాయి సతీశ్‌కు వివాహేతర సంబంధం ఉంది. ఆమె ఇంటికి అతడు తరచూ..
దుగ్గిరాల : గుంటూరు జిల్లా దుగ్గిరాలలో మహిళపై హత్యాచారం జరిగినట్లు వార్తలొచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి కీలక వివరాలను గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వెల్లడించారు. వివాహితమై అత్యాచారమే జరగలేదని, ఆమెతో వివాహేతర సంబంధం కలిగిన వెంకటసాయి సతీశ్ అనే వ్యక్తి మిత్రుడు శివ సత్యసాయిరాం ఆమెను హత్య చేశాడని వెల్లడించారు. ఈ ఘటనలో అత్యాచారమన్న మాటే లేదని ఎస్పీ స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళతో వెంకట సాయి సతీశ్‌కు వివాహేతర సంబంధం ఉంది. ఆమె ఇంటికి అతడు తరచూ వెళ్లి వస్తుంటాడు. గురువారం అతడు తనతో పాటు తన మిత్రుడు శివ సత్యసాయిరాంను కూడా ఆమె ఇంటికి తీసుకెళ్లాడు. అయితే శివసత్య సాయిరాం కోరికను తీర్చేందుకు బాధిత మహిళ తిరస్కరించింది. పరాయి వ్యక్తిని తన వద్దకు తీసుకొచ్చినట్లుగా వెంకట సతీశ్‌పై ఫిర్యాదు చేస్తానని మహిళ చెప్పడంతో.. కోపోద్రిక్తుడైన శివసత్యసాయిరాం ఆమెను ఆమె చీరతోనే ఉరేసి చంపినట్లు ఎస్పీ వివరించారు.
Next Story