Sun Dec 22 2024 21:15:00 GMT+0000 (Coordinated Universal Time)
Encounter : ఎదురుకాల్పుల్లో 13కు చేరి మృతుల సంఖ్య
ఛత్తీస్ గడ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య పెరుగుతుంది
ఛత్తీస్ గడ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య పెరుగుతుంది. అందిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకూ ఈ ఎన్ కౌంటర్ లో పదమూడు మంది మావోయిస్టులు మరణించినట్లు తెలిసింది. బీజాపూర్ జిల్లాలో జరిగిన పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. నిన్నటి నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. అనేక మంది మావోయిస్టులు తీవ్రంగా గాయపడినట్లు చెబుతున్నారు.
సమావేశమయ్యారని...
కొర్బోలి, లేంద్ర గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమాచారం అయ్యారన్న సమాచారం రావడంతో భద్రతాదళాలు అక్కడకు వెళ్లాయి. వారిని చూసిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఇప్పటి వరకూ పదమూడు మంది మావవోయిస్టులు మరణించినట్లు పోలీసులు చెబుతున్నారు. మావోయిస్టుల కోసం ఇంకా గాలింపు చర్యలను భద్రతాదళాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మృతదేహాలతో పాటు కొన్ని ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Next Story