Mon Dec 23 2024 08:05:04 GMT+0000 (Coordinated Universal Time)
నైట్ ఫ్రెండ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఉదయాన్నే చూస్తే ఫ్యాన్ ఉరికి వేలాడుతూ..
తెల్లారి డ్యూటీ నుంచి వచ్చిన పావని స్నేహితులు ఎంతసేపు డోర్ కొట్టినా తీయకపోవడంతో.. హాస్టల్ ఓనర్ కు చెప్పారు. వెంటనే పోలీసులకు..
శ్రీకాకుళం : గతరాత్రి జరిగిన ఫ్రెండ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో ఆ యువతి ఎంతో ఆనందంగా గడిపింది. తెల్లారేసరికి ఫ్యాన్ ఉరికి వేలాడుతూ.. విగతజీవిగా కనిపించింది. ఈ ఘటన శ్రీకాకుళంలో సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. మజ్జి పావని అనే యువతి నర్సింగ్ విద్యార్థిని. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఓ హాస్టల్ లో ఉంటూ.. చదువుకుంటూనే ఉద్యోగం చేస్తోంది. గతరాత్రి తన స్నేహితురాలి పుట్టినరోజు కావడంతో.. తానే స్వయంగా కేక్ కొని, కట్ చేయించింది. బర్త్ డే సెలబ్రేషన్స్ అయ్యాక.. అందరూ ఎవరి రూమ్ కి వారు వెళ్లిపోయారు. కొందరు నైట్ షిప్ట్ డ్యూటీకి వెళ్లారు.
మజ్జి పావని తానుండే గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. తెల్లారి డ్యూటీ నుంచి వచ్చిన పావని స్నేహితులు ఎంతసేపు డోర్ కొట్టినా తీయకపోవడంతో.. హాస్టల్ ఓనర్ కు చెప్పారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. తలుపులు బద్దలు కొట్టి చూశారు. అంతే.. ఎదురుగా పావని ఫ్యాన్ కి ఉరివేసుకుని చనిపోయి ఉన్న దృశ్యం కనిపించింది. అది చూసిన ఆమె స్నేహితురాళ్లంతా బోరుమన్నారు. రాత్రంతా తమతో నవ్వుతూ.. సరదాగా గడిపిన పావని ఇంతపని చేస్తుందనుకోలేదంటూ విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. కూతురు ఇక లేదన్న విషయం తెలిసి వారు లబోదిబోమని ఏడ్చాారు. కాగా.. పావనిది ఆత్మహత్యేనని ఖచ్చితంగా చెప్పలేమని, ఇది హత్య కూడా అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. క్లూస్ టీమ్‌తోపాటు స్నిఫర్ డాగ్స్‌ని రంగంలోకి దించారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
Next Story