Mon Dec 23 2024 13:41:00 GMT+0000 (Coordinated Universal Time)
శిరీష మృతికేసులో వీడిన మిస్టరీ.. దారుణంగా చంపేశారు
చెప్పినమాట వినకుండా.. తరచూ ఫోన్ చూస్తూ ఉంటుండటంతో శిరీషతో బావ అనిల్ వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత శిరీష మరో రూమ్..
వికారాబాద్ లో నర్సింగ్ విద్యార్థిని శిరీష (19) అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసు విచారణ కొలిక్కి వచ్చింది. మృతురాలి బావ, అతని స్నేహితుడు కలిసి శిరీషను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. శిరీష కేసులో తొలి నుంచి ఆమె బావపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మూడు రోజులుగా పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నా నోరు మెదపలేదు. అనిల్ కాల్ డేటా ఆధారంగా అతడి స్నేహితుడుని అదుపులోకి తీసుకుని.. తమదైన శైలిలో పోలీసులు విచారణ చేయడంతో శిరీషను తామే హత్య చేసినట్లు నేరం అంగీకరించాడు.
చెప్పినమాట వినకుండా.. తరచూ ఫోన్ చూస్తూ ఉంటుండటంతో శిరీషతో బావ అనిల్ వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత శిరీష మరో రూమ్ లోకి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసిందని, అనిల్ ఆ రూమ్ గడియ విరగ్గొట్టి శిరీషను బయటకు తీసుకొచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత అనిల్ పరిగి వెళ్లిపోగా.. శిరీష మనస్తాపంతో ఇంట్లో నుండి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని ఆమె తమ్ముడు అనిల్ కు ఫోన్ చేసి చెప్పడంతో.. అప్పటికే ఫుల్ గా మద్యం తాగి ఉన్న అనిల్ స్నేహితుడితో కలిసి కాడ్లాపూర్ కు బయల్దేరాడు.
ఊరి శివారులో ఉన్న మైసమ్మ గుడికి సమీపంలో శిరీష కనిపించడంతో అనిల్ కోపంతో ఆమెపై చేయి చేసుకున్నాడు. అనిల్ స్నేహితుడు ఆమెను కుంటవైపు లాక్కెళ్లి బీరుబాటిల్ ను పగులగొట్టి కళ్లల్లో గుచ్చాడు. వదిలేయాలని ఎంత ప్రాథేయపడినా వదల్లేదు. ఇద్దరూ కలిసి శిరీషను మోకాలిలోతు ఉన్న కుంటలోకి విసిరేసి, ఆమె చనిపోయేంతవరకూ అనిల్ స్నేహితుడు ఆమె దేహంపైనే నిల్చున్నాడు. ఆమె చనిపోయాక శిరీష ఇంటికెళ్లి వెతుకుతున్నట్లు నటించారు. ఉదయానికి శిరీష మృతదేహం కుంటవద్ద కనిపించడంతో ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశారు. చివరికి పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో శిరీషను ఎంత దారుణంగా చంపారో చెప్పారు. అనిల్, అతని స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story