Mon Dec 23 2024 06:08:11 GMT+0000 (Coordinated Universal Time)
మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి జర్నలిస్ట్ మృతి..
వృత్తిలో భాగంగా మావోయిస్టుల కార్యకలాపాల గురించి తెలుసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే మదన్‌పూర్ రాంపూర్ బ్లాక్‌లోని
భద్రతా దళాలు లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి జర్నలిస్ట్ మృతి చెందిన ఘటన.. ఒడిషా రాష్ట్రంలోని కలహండిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కలహండిలో ఈ నెలలో జరిగే ఐదు దశల పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ మేరకు కొన్ని పోస్టర్లు, బ్యానర్లను పలు గ్రామాల్లో అంటించారు. రోహిత్ కుమార్ బిశ్వాల్ (46) అనే వ్యక్తి భువనేశ్వర్ నుంచి ప్రచురితమయ్యే ఓ దినపత్రికలో జర్నలిస్ట్, ఫొటో గ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.
వృత్తిలో భాగంగా మావోయిస్టుల కార్యకలాపాల గురించి తెలుసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే మదన్‌పూర్ రాంపూర్ బ్లాక్‌లోని దోమ్‌కర్లకుంటా గ్రామం వద్ద మావోయిస్టులు ఓ చెట్టుకు అతికించిన పోస్టర్లు, బ్యానర్‌ను చూస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ అమర్చిన ఐఈడీ బాంబు పేలి మరణించాడని కలహండీ ఎస్పీ డాక్టర్ వివేక్ చెప్పారు. భద్రతా సిబ్బంది లక్ష్యంగా మావోయిస్టులు బాంబులు అమర్చగా.. ఆ బాంబు పేలినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. జర్నలిస్టు మృతి పట్ల ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం ప్రకటించారు. రోహిత్ కుమార్ కుటుంబానికి రూ.13 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఈ పరిహారం రూ.9 లక్షలు పోలీసులు ఇవ్వగా.. మిగతా రూ.4 లక్షలు జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి అందించనున్నట్లు ఒడిశా ప్రభుత్వ మీడియా సలహాదారు మానస్ మంగరాజ్ తెలిపారు.
News Summary - Odisha journalist killed in IED blast reportedly planted by Maoists
Next Story