Mon Dec 23 2024 06:21:02 GMT+0000 (Coordinated Universal Time)
ఫోన్ ను భార్యకు బహుమతిగా ఇచ్చిన భర్త.. ఈఎంఐలో కొన్నాడని తెలిసి షాకింగ్ నిర్ణయం
స్మార్ట్ ఫోన్ విషయంలో భర్తతో గొడవపడి ఓ మహిళ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఒరిస్సా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా కలిమెల బ్లాక్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కన్హయ్య.. జ్యోతిని ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. భర్త భార్యకు నెలవారీ ఫైనాన్స్(ఈఎంఐ) ప్రాతిపదికన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేశాడు. జ్యోతికి ఈ విషయం తెలియజేయలేదు. అన్ని ఈఎంఐలు భర్త చెల్లించేశాడు.. దీంతో ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి ఒక డాక్యుమెంట్‌పై సంతకం కోసం అతని ఇంటికి వెళ్లాడు. ఈ సమయంలో జ్యోతికి EMIలో మొబైల్ ఫోన్ కొనుగోలు చేసినట్లు తెలిసింది. తర్వాత కన్హయ్య ఇంటికి తిరిగి రాగానే జ్యోతి అతనితో గొడవపడి విషం తాగింది. అది చూసి కన్హయ్య కూడా కుప్పకూలిపోయాడు. వారిద్దరినీ జిల్లా కేంద్రాసుపత్రికి తరలించగా, జ్యోతి మృతి చెందినట్లు నిర్ధారించారు.
పోలీసులు ఈ ఘటనపై మాట్లాడుతూ "జ్యోతి తన ప్రాణాన్ని తీసుకోడానికి విషం తాగింది. కన్హయ్య తన భార్యను బహుమతిగా ఇవ్వడానికి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేశాడు. ఫోన్ ధర ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా దాన్ని చెల్లించే స్థోమత లేకపోవడంతో భర్త ఈఎంఐ ఆప్షన్‌ను ఎంచుకున్నాడు. ఆమె భర్త చివరి వాయిదా చెల్లించిన వెంటనే, ఫైనాన్స్ కంపెనీ అధికారులు సంతకం కోసం దంపతుల ఇంటికి వచ్చారు. గొడవ మొదలై.. జ్యోతి తన భర్త ముందే విషం తాగింది. ఇది చూసిన భర్త షాక్‌తో నేలపై కుప్పకూలిపోయాడు. వారిద్దరినీ ఆసుపత్రికి తరలించగా, జ్యోతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కన్హయ్య ఇంకా షాక్ నుండి కోలుకోలేదు.. ఇంకా చికిత్స పొందుతున్నాడు." అని తెలిపారు
Next Story