Mon Dec 23 2024 01:36:10 GMT+0000 (Coordinated Universal Time)
ఓల్డ్ సిటీలో తుపాకీ మిస్ ఫైర్
హైదరాబాద్ నగరంలోని తుపాకీ మిస్ ఫైర్ అయిన ఘటన
హైదరాబాద్ నగరంలోని తుపాకీ మిస్ ఫైర్ అయిన ఘటన కలకలం రేపింది. హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదవశాత్తు తుపాకీ మిస్ ఫైర్ కావడంతో ఓ నిండుప్రాణం బలైంది. కబుతర్ఖాన ప్రాంతంలో రాత్రి విధులు ముగించుకుని నిద్రించే క్రమంలో హెడ్ కానిస్టేబుల్ భూపతి శ్రీకాంత్ చేతిలోని తుపాకీ మిస్ ఫైర్ కావడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన హెడ్ కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు.
రాత్రి విధులు ముగించుకున్న శ్రీకాంత్ పడుకునే సమయంలో చేతిలోని తుపాకీ ప్రమదవశాత్తు పేలింది. ఈ ఘటనలో శ్రీకాంత్ తీవ్రంగా గాయపడ్డారు. రక్తపు మడుగులో పడిఉన్న శ్రీకాంత్‌ను గమనించిన తోటి సిబ్బంది వెంటనే అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీకాంత్ కన్నుమూశాడు. ఈ ఘటనతో శ్రీకాంత్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story