Wed Apr 23 2025 07:11:49 GMT+0000 (Coordinated Universal Time)
Stray Dogs : పది వీధి కుక్కల దాడి.. వృద్ధురాలి మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక వృద్ధురాలిపై వీధికుక్కలు దాడి చేయడంతో ఆమె మరణించింది

వీధికుక్కల బెడద ఎక్కువయింది. చిన్నారులే కాదు పెద్దలు కూడా వీధి కుక్కల బారిన పడి మరణిస్తున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక వృద్ధురాలిపై వీధికుక్కలు దాడి చేయడంతో ఆమె మరణించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాడ్ మండలం సేవలాల్ తండాలో ఈ ఘటన జరిగింది. సేవాలాల్ తండా బట్టువాని తాళ్ల గ్రామానికి చెందిన పిట్ల రాజ్యలక్ష్మి వయసు 82 సంవత్సరాలు. అయితే ఇంట్లో ఉన్న ఆమెపై కుక్కలు దాడి చేసినట్లు బంధువులు గుర్తించారు.
ఇంట్లో ఉన్న సమయంలో...
తీవ్రంగా గాయపర్చడంతో రాజ్యలక్ష్మి మరణించింది. ఈ ఘటన కుటుంబంలోనే కాదు గ్రామంలోనూ విషాదం నింపింది. ఆమె నిద్రిస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన కుక్కలు దాడి చేసి ఉంటాయని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు పది కుక్కలు వృద్ధురాలిపై దాడిచేయడంతో ఆమె మరణించిందని చెబుతున్నారు. ఈ ఘటనతో తమ గ్రామంలో వీధికుక్కలను తరిమేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Next Story