Mon Dec 23 2024 02:46:34 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో కాల్పులు... యువకుల అత్యుత్సాహం
స్వాతంత్ర్యం దినోత్సవం రోజున హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. రాచకొండ మిర్ఖంపేట గెస్ట్ హౌస్ వద్ద కాల్పులు జరిగాయి
స్వాతంత్ర్యం దినోత్సవం రోజున హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. రాచకొండ మిర్ఖంపేట గెస్ట్ హౌస్ వద్ద కాల్పులు జరిగాయి. రాజకీయ నేతకు చెందిన పాంహౌస్ లో కొందరు యువకులు గన్ తో ఫైరింగ్ జరిపారు. పుట్టిన రోజు సందర్భంగా గెస్ట్ హౌస్ లో జరిపిన పార్టీలో గాలిలోకి కాల్పులు జరిపినట్లు సమాచారం.
సెల్ఫీ వీడియోను...
గన్ తో కాల్పులు జరుపుతూ సెల్ఫీ వీడియోను యువకులు తీసుకున్నారు. తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కొందరు కాల్పుల వీడియోను తమ స్టేటస్ గా పెట్టుకున్నారు. కాల్పుల సమయంలో కొందరు రాజకీయ నేతలున్నారని సమాచారం. దీనిపై పోలీసులు విచారణ జరపుతున్నారు. టీఆర్ఎస్వీ నేతలు విఘ్నేశ్వర్ రెడ్డి, విక్రమ్ లు కాల్పులు జరిపినట్లు గుర్తించారు. రాజకీయ నేత రవీందర్ రెడ్డికి చెందిన ఫాంహౌస్ లో ఈ కాల్పులు జరిపినట్లు నిర్ధారించారు.
Next Story