Mon Dec 23 2024 15:37:03 GMT+0000 (Coordinated Universal Time)
Drugs : ఫిలింనగర్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులు ఫిలింనగర్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు
హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసుల దాడలో హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో భారీగా డ్రగ్ర్ పట్టుకున్నారు. సబ్ పార్కింగ్ ప్రాంతంలో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించిన టాస్క్ఫోర్స్ పోలీసులు ఈ దాడి చేసి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బెంగళూరు కు చెందిన క్యాబ్ డ్రైవర్ బాబు కిరణ్ గా గుర్తించారు.
పబ్ బయట...
సమాచారం అందుకున్న పోలీసులు బాబు కిరణ్ ను అరెస్ట్ చేసి 20 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. పదిరోజుల వ్యవధిలోనే రెండోసారి డ్రగ్స్ పట్టుబడటం సంచలనం కలిగించింది. బాబు కిరణ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఈ డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ డ్రగ్స్ దందాలో కొందరు పరారయినట్లు తెలిసింది. ఎవరెవరికి బాబు కిరణ్ డ్రగ్ర్ విక్రయించారన్న దానిపై పోలీసులు విచారిస్తున్నారు.
Next Story