Sun Dec 22 2024 09:22:59 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాలో మరోసారి కాల్పులు .. ముగ్గురి మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించినట్లు సమాచారం.
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించినట్లు సమాచారం. దాదాపు పది మంది వరకూ గాయపడ్డారని పోలీసులు తెలిపారు. అమెరికాలోని సెంట్రల్ మిసిసిపీలో ఈ ఘటన చోటు చేసుకుంది. వందలాది మంది వ్యక్తులపై ఇద్దరు దుండగులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు.
కాల్పులు జరిపిన...
ఫుట్ బాల్ ఆట విజయాన్ని జరుపుకుంటున్నారని, వారి మధ్య ఘర్షణలు జరిగి ఈ కాల్పులు చోటు చేసుకున్నాయని పోలీసులు తెలిపారు. కాల్పులకు పాల్పడింది ఎవరన్నది ఇంకా తెలియదన్నారు. విచారణలో వాస్తవాలు వెలుగు చూస్తాయని తెలిపారు. వందలాది మంది ఆట ముగిసిన గంట తర్వాత పాఠశాళ హోమ్ ఫుల్ బాల్ విజయాన్ని జరుపుకుంటుండగా ఈ కాల్పులు జరిగాయి. కాల్పులు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకు వెళ్లి చికిత్స అందిస్తున్నారు.
Next Story