Sun Dec 22 2024 23:41:03 GMT+0000 (Coordinated Universal Time)
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం, విదేశీ కరెన్సీ పట్టివేత
జులై 22న నిర్వహించిన తనిఖీల్లో నాలుగు కేసుల్లో.. మొత్తం 93.28 లక్షల విలువైన ఒక కేజీ 559 గ్రాముల విలువైన బంగారాన్ని
శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఇటీవల దుబాయ్, కువైట్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను తనిఖీలు చేయగా.. అక్రమంగా బంగారం, విదేశీ కరెన్సీతో పాటు.. విలువైన సిగరెట్లను స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. జులై 22,23 తేదీల్లో జరిపిన తనిఖీల్లో ప్రయాణికుల లగేజీలను తనిఖీలు చేయగా.. బంగారం, కరెన్సీ, సిగరెట్లు లభ్యమయ్యాయని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. రెండు రోజుల్లో మొత్తం 8 స్మగ్లింగ్ కేసులు నమోదు చేసినట్లు వివరించారు.
జులై 22న నిర్వహించిన తనిఖీల్లో నాలుగు కేసుల్లో.. మొత్తం 93.28 లక్షల విలువైన ఒక కేజీ 559 గ్రాముల విలువైన బంగారాన్ని సీజ్ చేసినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. దుబాయ్ నుంచి విడివిడిగా వచ్చిన నలుగురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. మొదటి ప్రయాణికుడి వద్ద రూ.12.59 లక్షల విలువైన 240 గ్రాముల బంగారం, రెండవ కేసులో రూ.21.15 లక్షల విలువైన 348 గ్రాముల బంగారం, మూడవ కేసులో రూ.29.10 లక్షల విలువైన 474. 8 గ్రాముల బంగారం, నాలుగో కేసులో రూ.30.43 లక్షల విలువైన 496.6 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. మొత్తం నాలుగు కేసుల్లో సీజ్ చేసిన బంగారం విలువ రూ.93.28 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు.
జులై 23న నిర్వహించిన తనిఖీల్లో.. కువైట్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి వద్ద బియ్యం, సర్ఫ్, షాంపూ బాటిల్ ద్వారా రూ.42.8 లక్షల విలువైన 704 గ్రాముల బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. మూడో కేసులో రూ.7.56 లక్షల విలువైన విదేశీ కరెన్సీని సీజ్ చేశారు. బహ్రెయిన్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన మరో ప్రయాణికుడి వద్ద రూ.2,25,000 విలువైన 15 వేల విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. 2003 టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు.
Next Story