Fri Dec 20 2024 11:14:52 GMT+0000 (Coordinated Universal Time)
కిట్టీ పార్టీలతో కోట్లు కొట్టేసింది కిలాడీ లేడీ
గత కొన్నేళ్లుగా శిల్పా చౌదరి తన కున్న పరిచయాలతో మహిళలను నమ్మించింది.
శిల్పా చౌదరి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రెండు వందల కోట్లను కాజేసిన ఈ మాయలేడి పక్కా ప్లాన్ ప్రకారం ధనవంతులను తన ముగ్గులోకి లాగింది. ముఖ్యంగా డబ్బున్న మహిళలను ఆమె టార్గెట్ చేసింది. గత కొన్నేళ్లుగా శిల్పా చౌదరి తన కున్న పరిచయాలతో మహిళలను నమ్మించింది. పుప్పాలగూడ, మణికొండ, కోకాపేట, గండిపేట ప్రాంతాల్లో శిల్పా చౌదరి కిట్టీ పార్టీలను ఏర్పాటు చేసేది. వీకెండ్ పార్టీలను కూడా నిర్వహించేది.
ప్రొడ్యూసర్ అంటూ....
తాను సినిమా పరిశ్రమలో ప్రొడ్యూసర్ ని అంటూ పరిచయం చేసుకుంది. తెలంగాణలో మాత్రమే కాకుండా విజయవాడ, కర్నూలు జిల్లాలకు చెందిన మహిళలు కూడా శిల్పా చౌదరి వలలో పడిపోయారు. శిల్పా చౌదరికి తాను నాలుగు కోట్లు ఇచ్చానని రోహిణి అనే మహిళ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనేక మంది శిల్పా చౌదరి చేతిలో మోసపోయారు. దీంతో నార్సింగి పోలీస్ స్టేషన్ కు బాధిత మహిళలు క్యూ కడుతున్నారు.
Next Story