Sun Dec 22 2024 22:22:10 GMT+0000 (Coordinated Universal Time)
భార్యను హత్య చేసి పాత్రలో పెట్టి ఉడికించేసిన భర్త..!
భార్యను హత్య చేసి పాత్రలో పెట్టి ఉడికించేసిన భర్త
ఓ వ్యక్తి తన భార్యను చంపి.. ఆమె శరీర భాగాన్ని ఉడకబెట్టాడు. అది కూడా పిల్లల కళ్ళముందే ఈ ఘోరం చోటు చేసుకుంది. ఈ ఘటన పాకిస్థాన్ లో చోటు చేసుకుంది. మృతురాలి శరీరం నుండి ఒక కాలును వేరు చేసి.. ఆపై తన ఆరుగురు పిల్లల ముందు పెద్ద మెటల్ బాయిలర్ లో ఉడకబెట్టాడు. పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని గుల్షన్-ఎ-ఇక్బాల్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. మీడియా నివేదికల ప్రకారం, మృతురాలిని నర్గీస్గా గుర్తించారు. అక్రమ సంబంధాల కారణంగా ఈ హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దారుణమైన చర్యకు ప్రత్యక్ష సాక్షి అయిన నర్గీస్ 15 ఏళ్ల కుమార్తె స్థానిక పోలీసులకు ఫోన్ చేసి ఈ ఘటన గురించి తెలియజేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన తర్వాత తన తండ్రి ఆషిక్ తన ముగ్గురు తోబుట్టువులతో పారిపోయాడని ఆమె పోలీసులకు తెలిపింది.
బజౌర్ ఏజెన్సీకి చెందిన మహిళ భర్త ఆషిక్ వాచ్‌మెన్‌గా పనిచేస్తూ ఎనిమిది నుండి తొమ్మిది నెలలుగా మూతపడిన పాఠశాలలోని సర్వెంట్ క్వార్టర్లో నివసిస్తున్నాడు. ఆషిక్ తన భార్యను దిండుతో ఊపిరాడకుండా చేసి, ఆపై ఆమెను పిల్లల ముందే పెద్ద పాత్రలో ఉడకబెట్టాడు. అనాగరిక చర్య వెనుక గల కారణాలను పోలీసులు ఇంకా నిర్ధారించనప్పటికీ, భర్త తన భార్యను అక్రమ సంబంధాలు పెట్టుకోవాలని బలవంతం చేసి, ఆమె తన డిమాండ్లకు లొంగకపోవడంతో ఆమెను హత్య చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
జిల్లా ఈస్ట్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) అబ్దుర్ రహీమ్ షెరాజీ మాట్లాడుతూ మిగిలిన ముగ్గురు పిల్లలను పోలీసులు అదుపులో ఉన్నారని తెలిపారు. మరణించిన మహిళ మృతదేహాన్ని మెడికో-లీగల్ ఫార్మాలిటీల కోసం జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్‌కు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానితుడు ముగ్గురు పిల్లలను తనతో తీసుకెళ్లగా, మిగిలిన ముగ్గురు పిల్లలు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు.
News Summary - Pakistani man kills and boils wife in cauldron in front of their six children in Sindh
Next Story