Fri Mar 28 2025 20:11:43 GMT+0000 (Coordinated Universal Time)
పదకొండు మంది యూట్యూబర్లకు నోటీసులు
బెట్టింగ్ యాప్ కు ప్రమోషన్ చేస్తున్న పదకొండు మంది యూట్యూబర్లకు పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు

బెట్టింగ్ యాప్ కు ప్రమోషన్ చేస్తున్న పదకొండు మంది యూట్యూబర్లకు పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు సాయంత్రం లోగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వీరిలో యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, షర్షసాయి, విష్ణుప్రియ, కానిస్టేబుల్ గౌడ్ లకు నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వీరు బెట్టింగ్ యాప్ లకు ప్రమోషన్లు చేస్తున్నారన్న ఫిర్యాదుపై కసు నమోదయింది.
కేసు నమోదు చేసి...
ఈ మేరకు కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు వారిని విచారించేందుకు సిద్ధమవుతున్నారు. అనేక మంది బెట్టింగ్ యాప్ లను ఆశ్రయిస్తూ బలవుతున్న నేపథ్యంలో సెలబ్రిటీలుగా వీరు చట్ట విరుద్ధమైన కార్యక్రమాలుకు పాల్పడుతున్నారని భావించిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈరోజు సాయంత్రలోగా వీరంతా విచారణకు హాజరు కావాల్సి ఉంది.
Next Story