Mon Dec 23 2024 10:46:23 GMT+0000 (Coordinated Universal Time)
కూతురితో ప్రేమ, తల్లితో ఎఫైర్.. సీన్ కట్ చేస్తే శవమైన యువకుడు
తన కాల్స్ కట్ చేయడంతో ఆగ్రహంతో ఊగిపోయిన యువకుడు.. నేరుగా ఇంటికి వెళ్లాడు. యువతి తల్లితో ఘర్షణకు దిగి..
కూతుర్ని ప్రేమించి, తల్లితో అఫైర్ పెట్టుకున్న ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పశ్చిమబెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని మగ్రాహట్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనలో పోలీసులు విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. మగ్రాహట్ కు చెందిన మృతుడు అయోన్ మోండల్ (21) క్యాబ్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించి, ఆమెకు తెలియకుండా తల్లితో అఫైర్ నడుపుతున్నాడు. విజయదశమి రోజు సాయంత్రం వేళ ప్రేయసిని కలిసేందుకు అయోన్ ప్రయత్నించాడు. ఎన్నిసార్లు కాల్ చేసినా.. యువతి ఫోన్ కాల్స్ ని కట్ చేసింది.
తన కాల్స్ కట్ చేయడంతో ఆగ్రహంతో ఊగిపోయిన యువకుడు.. నేరుగా ఇంటికి వెళ్లాడు. యువతి తల్లితో ఘర్షణకు దిగి.. ఆమెపై దాడి చేశాడు. వెంటనే స్పందించిన అతని ప్రియురాలు, ఆమె సోదరుడు, తండ్రి ముగ్గురూ వచ్చి అయాన్ మోండల్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన యువతి సోదరుడు అయాన్ మోండల్ తలపై ఆయుధంతో బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు తీవ్రంగా గాయపడిన అయాన్.. అక్కడికక్కడే కుప్పకూలి.. ప్రాణాలు కోల్పోయాడు. అయాన్ హత్య గురించి బయటకు తెలియకుండా.. మృతదేహాన్ని రహస్యంగా మగ్రాహత్ ప్రాంతంలో నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి పడేశారు.
ఆ మర్నాడు అయాన్ కుటుంబ సభ్యులు హరిదేవ్ పూర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. అతని కోసం గాలిస్తున్న పోలీసులకు మృతదేహం కనిపించింది. అతని ఫోన్, క్లూస్ ఆధారంగా దర్యాప్తు సాగించిన పోలీసులు అసలు విషయాలను బయటపెట్టారు. అయాన్ మోండల్‌ను హతమార్చిన అతని ప్రియురాలు, ఆమె తల్లి, తండ్రి, సోదరుడు, మరో ఇద్దరు యువకులు సహా మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. మృతుడు అయాన్‌కి యువతితో పాటు, ఆమె తల్లితో అఫైర్ ఉందని, ఆ అఫైర్ కారణంగా గొడవలు జరుగుతుండేవని తేల్చారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు, వారిని రిమాండ్‌కు తరలించారు.
Next Story