Mon Dec 23 2024 08:46:30 GMT+0000 (Coordinated Universal Time)
ప్రియుడిని కలవడానికి వెళ్లిన ఆమెను కట్టేసి కొట్టారు.. ఎందుకంటే..?
స్థానికులు ఆమెను కర్రలు, రాడ్లతో కొట్టడమే కాకుండా తిట్టడం కూడా
ఉత్తరప్రదేశ్ (యూపీ)లోని సిద్ధార్థనగర్ జిల్లాలో ప్రియుడిని కలవడానికి వెళ్లిన ప్రియురాలికి గ్రామస్తులు పట్టుకుని కొట్టారు. తాలిబానీ తరహాలో కట్టేసి చిత్ర హింసలు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి ప్రియుడు, ప్రియురాలు ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారని తెలుస్తోంది. చాలా మంది మహిళలు ఆ మహిళను పట్టుకుని, తాడుతో కట్టేసి కొట్టడం ప్రారంభించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
స్థానికులు ఆమెను కర్రలు, రాడ్లతో కొట్టడమే కాకుండా తిట్టడం కూడా మొదలుపెట్టారు. యువతిని కొట్టడం చూసి ఆమె ప్రియుడు అక్కడి నుండి పారిపోయాడు. ప్రస్తుతం ఆ ప్రేమికుడి కోసం గ్రామానికి చెందిన కొందరు వెతుకుతున్నట్లు సమాచారం. ప్రియురాలు మరియు ఆమె ప్రియుడు ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వివాహేతర సంబంధంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు ఇలా శిక్ష విధించారు. షోహ్రత్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధ్వాపూర్లోని పురానా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, శిక్షించాలని డిమాండ్ వినిపిస్తోంది.
Next Story