Thu Dec 19 2024 09:58:13 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : బెంగళూరులో రేవ్ పార్టీ... ఏపీ ఎమ్మెల్యే అనుచరులేనని అనుమానం
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో తెలుగురాష్ట్రాలకు చెందిన వారు అరెస్టయ్యారు.
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో తెలుగురాష్ట్రాలకు చెందిన వారు అరెస్టయ్యారు. టాలీవుడ్ కు చెందిన కొందరితో పాటు యువతులు కూడా పట్టుబడినట్లు తెలిసింది. బెంగళూరులోని వ్యాపారవేత్తకు సంబంధించిన ఫాం హౌస్ లో ఈ రేవ్ పార్టీ జరిగింది. ఏపీ, తెలంగాణల నుంచి యువతీ, యువకులను అక్కడికి విమానంలో తరలించారు. రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో బెంగళూరు పోలీసులు ఫాం హౌస్ పై దాడులు చేశారు. ఈ సందర్భంగా అనేక మంది మోడళ్లతో పాటు టెకీలు కూడా దొరికారు.
తనది కాదంటున్న...
ఏపీకి చెందిన ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ రేవ్ పార్టీని నిర్వహించినట్లు చెబుతున్నారు. దాదాపు పదిహేనుకు పైగా విలువైన కార్లు పట్టుబడ్డాయి. రేవ్ పార్టీలో దొరికిన కార్లపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్కిక్కర్ ఉండటంతో ఆయన వివరణ ఇచ్చారు. ఆ వరేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని, ఆ స్టిక్కర్ కాలపరిమితి కూడా ముగిసిందని చెప్పారు. అలాగే సినీ నటి హేమ కూడా తాను రేవ్ పార్టీలో లేనని, ఇదంతా ప్రచారం మాత్రమేనని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాదక ద్రవ్యాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
Next Story