Mon Dec 23 2024 05:14:20 GMT+0000 (Coordinated Universal Time)
వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపిన కుక్క
అమెరికాలోని కాన్సాస్ లో నివాసం ఉండే 30 ఏళ్ల వ్యక్తి.. శనివారం తన పెంపుడు కుక్కతో కలిసి వేటకు వెళ్లాడు. పికప్ వ్యాన్ లో..
కుక్క అంటే సహజంగా అరుస్తుంది, కరుస్తుంది. కుక్క కాటుకు సరైన వైద్యం తీసుకోక మరణించిన దాఖలాలున్నాయి. కానీ ఒక కుక్క తుపాకీతో కాల్చి వ్యక్తిని చంపిందని ఎప్పుడైనా విన్నారా ? కానీ..అమెరికాలో ఓ కుక్క తుపాకీతో ఓ వ్యక్తిని కాల్చి చంపింది. అయితే అది కావాలని ఆ పనిచేయలేదు. అనుకోకుండా అలా జరిగిపోయింది. అమెరికాలోని కాన్సాస్ లో నివాసం ఉండే 30 ఏళ్ల వ్యక్తి.. శనివారం తన పెంపుడు కుక్కతో కలిసి వేటకు వెళ్లాడు. పికప్ వ్యాన్ లో అతను డ్రైవింగ్ సీట్లో కూర్చోగా.. తన వెనుక సీటులో కుక్కను కూర్చోబెట్టాడు.
అక్కడే లోడ్ చేసి ఉంచిన తుపాకీని ఉంచాడు. వెనుక సీట్లో కూర్చుకున్న కుక్క.. అటూ ఇటూ తిరుగుతూ తుపాకీ ట్రిగ్గర్ పై కాలు పెట్టింది. అంతే.. క్షణాల్లో తుపాకీలో నుండి బుల్లెట్ బయటికొచ్చి.. యజమానికి తగిలింది. దాంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలో గన్ కల్చర్ చాలా సాధారణం. తమ రక్షణకై ఈ మధ్య చాలా మంది తుపాకీ లైసెన్సులు తీసుకుంటున్నారు. గత మూడ్రోజులుగా అమెరికాలోని పలు ప్రాంతాల్లో జరిగిన దుండగుల కాల్పుల్లో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వారిలో ఒక తెలుగు విద్యార్థి కూడా ఉన్నాడు.
Next Story