Mon Dec 23 2024 09:50:06 GMT+0000 (Coordinated Universal Time)
స్కూల్ బాత్రూమ్ లో ప్రసవం.. పొదల్లో శిశువు మృతదేహం.. పోలీసుల ఎంట్రీతో ?
వెంటనే స్కూల్లో విద్యార్థులందరినీ ప్రశ్నించడంతో.. అసలు విషయం బయటపడింది. 11వ తరగతి చదువుతున్న..
తమిళనాడులోని కడలూరు జిల్లా భువనగిరి లోని పాఠశాల సమీపంలో ఉన్న పొదల్లో ఒక చిన్నారి మృతదేహం ఉండటం కొందరు విద్యార్థులు గుర్తించారు. ఈ విషయాన్ని విద్యార్థులు పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా.. వారు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసుల రాకతో అసలు విషయం బయటపడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిన్నారికి పేగుతాడు కూడా సరిగ్గా తెంచలేదని గమనించారు. ప్రాథమిక అంచనా ప్రకారం స్కూలు ఆవరణలోనే ఆ శిశువు ప్రసవించినట్లు గుర్తించారు.
వెంటనే స్కూల్లో విద్యార్థులందరినీ ప్రశ్నించడంతో.. అసలు విషయం బయటపడింది. 11వ తరగతి చదువుతున్న బాలిక ఆ బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిసింది. బాలికను విచారించగా.. తాను స్కూల్ బాత్రూమ్ లో బిడ్డను ప్రసవించి.. స్కూల్ పక్కనున్న పొదల్లో బిడ్డను వదిలేసినట్లు తెలిపింది. వేరొక స్కూల్లో చదువుతోన్న 10వ తరగతి బాలుడి కారణంగా తాను గర్భం దాల్చినట్లు ఆమె చెప్పింది. దాంతో ఘటనకు బాధ్యుడైన బాలుడిపై పోలీసులు పోక్సోచట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
Next Story