Tue Nov 05 2024 16:27:46 GMT+0000 (Coordinated Universal Time)
రాజా రెడ్డి మరణంపై సంచలన ప్రకటన చేసిన పోలీసులు
ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని పూజ స్కూల్ కరస్పాండెంట్, మై డాడీ హోమ్ నిర్వాహకులు
ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని పూజ స్కూల్ కరస్పాండెంట్, మై డాడీ హోమ్ నిర్వాహకులు రాజారెడ్డి అనుమానస్పద స్థితిలో ఇటీవల మృతి చెందారు. పాఠశాల ఆవరణంలో విగతజీవిగా పడి ఉన్న ఆయన్ను పాఠశాల సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తాజాగా రాజారెడ్డి మతిపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో రీపోస్టుమార్టం నిర్వహించారు.
రాజా రెడ్డి ది హత్య అని పోలీసులు తేల్చారు.ఆస్తుల తగాదాల విషయంలో సొంత తమ్ముడు శ్రీధర్ రెడ్డి, అతడి భార్య ప్రసన్నలు కలిసి హత్య చేశారని పోలీసులు గుర్తించారు. ఆగస్టు 11వ తేదీ రాత్రి 10 గంటలకు పూజ స్కూల్ ఆవరణలో ఉన్న రాజా రెడ్డి పై దాడి చేసి హత్య చేశారని పోలీసులు తెలిపారు. గొంతు నులిమి, ఊపిరి ఆడకుండా చంపారని పోస్టు మార్టంలో తేలింది. రాజారెడ్డిని చంపాక ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. రాజారెడ్డి గుండెపోటు తో మరణించాడని నమ్మించడానికి ప్రయత్నించారు. నిందితులకు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ వీర నాథ్ రెడ్డి సహకరించారని ఆరోపణలు రావడంతో.. జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఆదేశాలతో రీపోస్ట్ మార్టం నిర్వహించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. మృతుడు రాజా రెడ్డి తమ్ముడు శ్రీధర్ రెడ్డి, ప్రసన్న, ఇద్దరు కిరాయి వ్యక్తులు, ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ వీరనాథ్ రెడ్డి పై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు.
డాడీ హోమ్గా పిలుస్తున్న ఈ ప్రాంతంలో 150 మంది పేదలున్నారు. అనాథలు, వీధి పిల్లలు, హెచ్ఐవి సోకిన పిల్లలు, పెద్దలు, అత్యాచార బాధితులు, మానసిక వికలాంగులు, వద్ధులు ఇందులో ఉన్నారు. ఒంటరి జీవితం గడుపుతున్న వారికి ఆసరాగా ఉంటోంది. ఆయన మృతితో అందులో ఉంటున్న వారిలో తీవ్ర విషాదం నెలకొంది. రాజారెడ్డి అనాథ పిల్లలను చేరదీసి వారికి చదువు, క్రీడల్లో ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఆయన మృతి చెందడంతో విషాదం నెలకొంది.
Next Story