Mon Dec 23 2024 20:32:58 GMT+0000 (Coordinated Universal Time)
Lasya Nanditha : ప్రమాదానికి గల కారణం.. డ్రైవర్ నిద్రమత్తు.. నిర్లక్ష్యమేనా?
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పై అనేక అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పై అనేక అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఆమె సీటు బెల్ట్ పెట్టుకోక పోవడంతోనే మరణించారని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. కారు వేగంగా వస్తూ ముందు వాహనాన్ని తప్పించబోయి డ్రైవర్ అదుపుతప్ప్పడంతో డివైడర్ ను ఢీకొట్టాడు. అయితే ఆ సమయంలో లాస్య నందిత సీటు బెల్ట్ పెట్టుకోలేదని తెలిసింది. లాస్య నందిత కారు మధ్యలో కూర్చుని ఉన్నారని చెబుతున్నారు.
నిద్రమత్తు కూడా...
అతి వేగం, నిద్రమత్తు కూడా ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. నిద్ర లేకపోవడంతో పాటు త్వరగా ఇల్లు చేరాలన్న ఉద్దేశ్యంతో డ్రైవర్ అతి వేగంతో కారును నడుపుతూ ఈ ప్రమాదానికి గురి చేశాడు. మేడ్చల్ నుంచి పటాన్ చెర్వకు వెళుతుండగాగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. అయితే లాస్య నందిత ఎప్పుడూ రాత్రి వేళ ప్రయాణించే వాళ్లు కారని, అర్జంట్ పని మీద వెళ్లడంతోనే ఆమె తెల్లవారు జామున ప్రయాణిస్తూ ఈ ప్రమాదానికి గురయ్యారని బంధువులు విలపిస్తున్నారు.
వాహనాన్ని తప్పించిబోయి...
చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయిన లాస్య నందిత తన తండ్రి సాయన్న ఆశయాలను అమలు చేయాలని భావించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు పర్సనల్ అసిస్టెంట్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. మేడ్చల్ నుంచి పటాన్ చెర్వుకు వస్తున్న సందర్భంలో మంచు కూడా ఉండటంతో కొంత ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. సడన్ బ్రేక్ వేయడంతో అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టిందని తెలిపారు. మొత్తం మీద లాస్య నందిత మరణానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి.
Next Story