Thu Dec 26 2024 22:23:11 GMT+0000 (Coordinated Universal Time)
గంటలో నాలుగు ఏటీఎంల లూటీ
గంటలో నాలుగు ఏటీఎంలను పగులగొట్టి దోచుకున్న ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు. తమిళనాడులో ఈ ఘటన జరిగింది
గంటలో నాలుగు ఏటీఎంలను పగులగొట్టి దోచుకున్న ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు. తమిళనాడులో ఈ ఘటన జరిగింది. తమిళనాడులోని తిరువన్నామలైలో కేవలం గంటలోనే నాలుగు ఏటీఎంలను దోపిడీకి పాల్పడ్డారు. వీరు ఏపీకి చెందిన దొంగల ముఠాగా పోలీసులు భావిస్తున్నారు.
ఏపీకి చెందిన గ్యాంగ్...
గంటలో నాలుగు ఏటీఎంల నుంచి ఎనభై లక్షల రూపాయలను దోపిడీ దొంగలు దోచుకున్నారు. వీరు వచ్చిన వాహనాలు ఏపీ రిజిస్ట్రేషన్ నెంబర్ తో ఉన్నాయి. దీంతో ఏపీకి చెందిన ముఠా పనేనని తమిళనాడు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు బయలుదేరి వెళ్లాయి. ఏపికి చెందిన గ్యాంగ్ ల గురించి ఆరా తీస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించిన తమిళనాడు పోలీసులు వారి కోసం వెదుకులాటను ప్రారంభించారు.
Next Story