Thu Dec 26 2024 17:57:06 GMT+0000 (Coordinated Universal Time)
డ్రగ్స్ డాన్ టోనీ అరెస్ట్
ముంబయి డ్రగ్స్ మాఫియా ప్రధాన నిందితుడు టోనీని పోలీసులు ముంబయిలో అరెస్ట్ చేశారు
ముంబయి డ్రగ్స్ మాఫియా ప్రధాన నిందితుడు టోనీని పోలీసులు ముంబయిలో అరెస్ట్ చేశారు. ఎట్టకేలకు టోనీ అరెస్ట్ కావడంతో డ్రగ్స్ గుట్టు మరింత బయటపడే అవకాశముంది. గత కొంతకాలంగా టోనీ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. టోనీ డ్రగ్స్ ర్యాకెట్ లో ప్రధాన నిందితుడిగా గుర్తించారు. కొత్త సంవత్సర వేడుకలకు డ్రగ్స్ ను హైదరాబాద్ కు తీసుకు వచ్చిన కొందరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అనేక నగరాలకు...
ఈ ముఠాకు నాయకుడిగా టోనీ వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచి టోనీ కోసం పోలీసులు వెదుకుతున్నారు. టోనీ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబయిలలో డ్రగ్స్ ను సరఫరా చేసేవాడు. ఇందుకోసం ప్రత్యేక గ్యాంగ్ లను ఏర్పాటు చేసుకున్నాడు. హైదరాబాద్ లో 300 మంది సెలబ్రిటీలకు టోనీ డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. టోనీ అరెస్ట్ తో ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేశాడన్న విషయం తేలిపోనుంది.
Next Story