Mon Dec 23 2024 17:15:20 GMT+0000 (Coordinated Universal Time)
అశ్విన్-మాన్య 8 సంవత్సరాల రిలేషన్ షిప్.. చివరికి..!
ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై ఆరెకోడు పోలీసులు కేసు నమోదు
కేరళ రాష్ట్రంలోని మలప్పురంలో ఆత్మహత్యకు పాల్పడింది ఓ యువతి. ఆ యువతికి కాబోయే భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. అశ్విన్ (26)పై ఆత్మహత్యకు ప్రేరేపించడం సహా పలు అభియోగాలు నమోదు చేశారు. తృక్కలయూర్కు చెందిన మాన్య (22) గత జూన్లో తన బెడ్రూమ్లో ఉరి వేసుకుని కనిపించింది. మాన్య కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఆరీకోడ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె మృతిపై అనుమానాలున్నాయని, విచారణ జరిపించాలని వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు. మాన్యను అశ్విన్ మానసికంగా హింసించేవాడని ఆ తర్వాత విచారణలో తేలింది.
మాన్య ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పలు ఆరోపణలు చేశారు. మాన్య మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై ఆరెకోడు పోలీసులు కేసు నమోదు చేశారు. 2021 సెప్టెంబర్ నెలలో మాన్య- అశ్విన్ నిశ్చితార్థం. కొన్ని సంవత్సరాలుగా ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. సెప్టెంబర్ 2021లో నిశ్చితార్థానికి ముందు మాన్య-అశ్విన్లు ఎనిమిదేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లిన అశ్విన్, అనేక సమస్యలను సృష్టించి మాన్యతో సంబంధాలను తెంచుకున్నాడు. పెళ్లి జరగదని అశ్విన్ చెప్పడం వల్లే మాన్య ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. మాన్య వాడిన ఫోన్ నుంచి వారి వాయిస్ మెసేజ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత అశ్విన్ ను అరెస్ట్ చేశారు.
Next Story