Thu Dec 26 2024 17:27:08 GMT+0000 (Coordinated Universal Time)
ఐపీఎల్ బ్లాక్ టిక్కెట్ల దొంగల అరెస్ట్
ఐపీఎల్ టిక్కెట్ల ను బ్లాక్ లో అమ్ముతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఐపీఎల్ టిక్కెట్ల ను బ్లాక్ లో అమ్ముతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరు బెంగళూరుకు చెందిన వ్యక్తికాగా, మరొకరు హైదరాబాద్ కు చెందిన వారు. ఇద్దరూ ఐపీఎల్ టిక్కెట్లను బ్లాక్ లో అమ్ముతుండగా దొరికిపోయారు. వీరి వద్ద నుంచి కొన్ని టిక్కెట్లతో పాటు భారీగా నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు కు చెందిన రమణ, హైదరాబాద్ కు చెందిన శ్యామ్యూల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిన్నటి మ్యాచ్ లో...
నిన్న హైదరాబాద్ సన్ రైజర్స్ తో బెంగలూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కు కూడా భారీగా ఇద్దరు కలసి టిక్కెట్లు అమ్ముతున్నారని సమాచారం తెలియడంతో నిఘా వేసిన పోలీసులు మాటు వేసి వీరిని పట్టుకున్నారు. వీరిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు.
Next Story