Mon Dec 23 2024 09:22:29 GMT+0000 (Coordinated Universal Time)
జియాగూడ హత్యకేసు.. నిందితులు స్నేహితులే
సాయినాథ్ ను వెంబడించి.. అదనుచూసి అతనిపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టి.. కాలు విరిచేసి.. కత్తితో పొడిచి, గొడ్డలితో నరికి
హైదరాబాద్ లోని పాతబస్తీలోని జియాగూడలో ఆదివారం పట్టపగలు నడిరోడ్డుపై.. సాయినాథ్ అనే అంబర్ పేట బతుకమ్మ కుంటకు చెందిన కార్పెంటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ముగ్గురు వ్యక్తులు పక్కా ప్లాన్ ప్రకారం.. సాయినాథ్ ను వెంబడించి.. అదనుచూసి అతనిపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టి.. కాలు విరిచేసి.. కత్తితో పొడిచి, గొడ్డలితో నరికి దారుణంగా హతమార్చారు. ఇంత జరుగుతున్నా.. బాధితుడు కేకలు పెడుతున్నా ఒక్కరూ అతడిని కాపాడేందుకు ముందుకి రాలేదు. చివరికి ఓ కానిస్టేబుల్ అక్కడికి రావడంతో.. నిందితులు పరారయ్యారు. అనంతరం వారు మరో పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.
కాగా.. తాజాగా ఈ హత్యకు కారణం ఆర్థిక కారణాలేనని పోలీసులు భావిస్తున్నారు. సాయినాథ్ స్నేహితులే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపారు. నిందితులు అక్షయ్, టిల్లు, సోనుగా గుర్తించారు. సాయినాథ్ ను అనుసరిస్తూ పక్కా పథకం ప్రకారమే వారు హత్యకు పాల్పడ్డారని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. కాగా.. హత్య సమయంలో సాయినాథ్ ను కాపాడేందుకు ఎవరూ ముందుకి రాకపోగా.. వీడియోలు తీసి నెట్టింట్లో పెట్టడంతో.. అవి కాస్తా వైరల్ అయ్యాయి.
Next Story