Mon Dec 23 2024 15:17:25 GMT+0000 (Coordinated Universal Time)
కూకట్ పల్లిలో రేవ్ పార్టీ భగ్నం.. ఇద్దరు హిజ్రాలతో పాటు?
కూకట్ పల్లిలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. రేవ్ పార్టీ నిర్వహిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కూకట్ పల్లిలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. అందిన సమాచారం మేరకు అక్కడకు వెళ్లి రేవ్ పార్టీ నిర్వహిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూకట్ పల్లి వివేకానంద నగర్ లో ఒక ఇంట్లో రేవ్ పార్టీ జరుగుతుందని సమాచారం అందింది. దాదాపు నలభై మంది యువకులతో పాటు ఇద్దరు హిజ్రాలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుననారు.
వీకెండ్ పార్టీలకు....
ఇక్కడ యువకులు వీకెండ్ పార్టీలు చేసుకోవడం అలవాటుగా మారింది. వీరందరూ హోమో సెక్సువల్ అని పోలీసులు గుర్తించారు. ఇద్దరు హిజ్రాలు కూడా ఉండటంతో ఈ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి నుంచి భారీగా మద్యం సీసాలతో పాటు కండోమ్ ప్యాకెట్లను కూడా ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Next Story