Sun Dec 22 2024 17:44:30 GMT+0000 (Coordinated Universal Time)
జానీ మాస్టర్‌పై కేసు నమోదు
టాలివుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై పోలీసు కేను నమోదయింది.
టాలివుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై పోలీసు కేను నమోదయింది. ఒక మహిళ డ్యాన్సర్ ఇచ్చిన ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్ తనను కొద్ది రోజులుగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
జీరో ఎఫ్ఐఆర్...
అయితే దీనిపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకన్న చెప్పారు. అయితే ఈ కేసు తమ పరిధిలో కానందున నార్సింగి పోలీస్ స్టేషన్ పంపినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసుపై పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై జానీ మాస్టర్ స్పందించాల్సి ఉంది.
Next Story