Tue Dec 24 2024 03:24:36 GMT+0000 (Coordinated Universal Time)
మహేష్ బ్యాంక్ కేసులో 23 మంది హ్యాకర్ల అరెస్ట్
మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో రెండు నెలల పాటు విచారణ చేశామని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు
మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో రెండు నెలల పాటు విచారణ చేశామని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. వంద మంది పోలీసు అధికారులతో ఈ కేసు దర్యాప్తు చేశామని చెప్పారు. తమకు ఏ కేసులోనూ దర్యాప్తు కోసం ఖర్చవనంత ఈ కేసులో అయిందన్నారు. టీఏ, డీఏలు కలిపి యాభై ఎనిమిది లక్షల రూపాయలు తమ శాఖకు విచారణ నిమిత్తం ఖర్చు చేశామని సీవీ ఆనంద్ తెలిపారు. బ్యాంకులు ఆర్బీఐ నిబంధనలను పాటించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని అన్నారు. ప్రజల సొమ్ము అని తెలిసి కూడా బ్యాంకు యాజమాన్యాలు నిర్లక్ష్యం చేయడం విచారకరమని చెప్పారు.
బ్యాంకు యాజమాన్యం నిర్లక్ష్యం.....
నవంబరు నెలలో మహేష్ బ్యాంకుకు చెందిన 200 మంది ఉద్యోగులకు ఫిఫింగ్ మెయిల్స్ హ్యాకర్ పంపారన్నారు. నైజీరియా నుంచి ఈ స్కామ్ చేశారని సీీవీ ఆనంద్ తెలిపారు. బ్యాంకింగ్ వ్యవస్థ లో సింగిల్ నెట్ వర్క్ వాడితే ఇలాంటివి జరుగుతాయని చెప్పారు. ఇప్పటి వరకూ 23 మంది హ్యాకర్లను అరెస్ట్ చేశామని చెప్పారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే హ్యాకింగ్ చేయడం సులువయిందని తెలిపారు. ప్రధాన హ్యాకర్ ఎక్కడ ఉన్నడో తెలియడం లేదన్నారు. రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసి ప్రధాన నిందితుడిని పట్టుకొస్తామని సీవీ ఆనంద్ తెలిపారు. నిర్లక్ష్యం వహించిన మహేష్ బ్యాంకు మేనేజ్ మెంట్ ను కూడా విచారిస్తామని చెప్పారు.
Next Story