Fri Mar 21 2025 00:11:56 GMT+0000 (Coordinated Universal Time)
నాచారంలో కానిస్టేబుల్ ఆత్మహత్య
శనివారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన రాజు.. ఆదివారం ఉదయం గదిలో విగతజీవిగా.. ఉరికి వేలాడుతూ కనిపించాడు.

హైదరాబాద్ లోని నాచారం పీఎస్ పరిధిలో కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. తేజావత్ రాజు అనే కానిస్టేబుల్ తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాచారం పోలీసులు తెలిపిన వివరాలకు మేరకు తేజావత్ రాజు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మహేశ్వరం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. నాచారం పీఎస్ పరిధిలోని సింగం చెరువు తండాలో నివాసం ఉంటున్నాడు.
Also Read : ముంబై సీఎంను కలిసిన కేసీఆర్
శనివారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన రాజు.. ఆదివారం ఉదయం గదిలో విగతజీవిగా.. ఉరికి వేలాడుతూ కనిపించాడు. రాజును చూసిన కుటుంబ సభ్యులు ఖంగు తిన్నారు. వెంటనే నాచారం పోలీసులకు సమాచారం అందించగా.. వారు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలను బట్టి.. రాజు ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని, రాజు మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించారు.
Next Story