Mon Dec 23 2024 13:17:07 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : 46 మంది అరెస్ట్... 14 రోజుల రిమాండ్
సికింద్రాబాద్ స్టేషన్ లోని విధ్వంసం కేసులో పోలీసులు 46 మందిని అరెస్ట్ చేశారు. వారిపై 15 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని విధ్వంసం కేసులో పోలీసులు 46 మందిని అరెస్ట్ చేశారు. వారిపై 15 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసిన 46 మందిని రైల్వే కోర్టు న్యాయమూర్తి ముందు పోలీసులు హాజరుపర్చారు. విచారించిన న్యాయమూర్తి వీరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. వారిని చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించారు.
మిగిలిన వారిని గుర్తించేందుకు...
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి పాల్పడిన ఆర్మీ అభ్యర్థులను మిగిలిన వారిని సయితం అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వీరిని గుర్తించేందుకు సీసీ టీవీ ఫుటేజీల ద్వారా, మీడియా క్లిప్పింగ్ ల నుంచి వారిని గుర్తించే పనిలో పడ్డారు. మరో వైపు ఈ విధ్వంసానికి కుట్ర పన్నినట్లు భావిస్తున్న సాయి అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావును పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Next Story