Mon Dec 23 2024 13:58:11 GMT+0000 (Coordinated Universal Time)
చైన్ స్నాచర్ ఉమేష్ ఖతిక్ అరెస్ట్
చైన్ స్నాచర్ ఉమేష్ ఖతిక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఖతిక్ ను అదుపులోకి తీసుకున్నారు
చైన్ స్నాచర్ ఉమేష్ ఖతిక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ కు వెళ్లిన పోలీసులు అక్కడ అహ్మదాబాద్ లో ఖతిక్ ను అదుపులోకి తీసుకున్నారు. గత మూడు రోజుల క్రితం ఉమేష్ ఖతిక్ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో వరసగా చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డాడు.
వరస స్నాచింగ్ లతో....
నాంపల్లిలోని మెజిస్టిక్ లాడ్జిలో దిగి ఆరు చైన్ స్నాచింగ్ లను చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే అప్పటికే ఉమేష్ ఖతిక్ గుజరాత్ పారిపోయాడని తెలిసింది. దీంతో ప్రత్యేక బృందాలు ఉమేష్ కోసం గుజారత్ వెళ్లాయి. అతడిని అదుపులోకి తీసుకున్నాయి. హైదరాబాద్ కు ఉమేష్ ఖతిక్ ను తీసుకు వస్తున్నారు.
Next Story