Fri Dec 20 2024 11:49:38 GMT+0000 (Coordinated Universal Time)
శిల్పా చౌదరి కేసులో విచారణను?
ప్రముఖులను మోసం చేసిన శిల్పా చౌదరి కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
ప్రముఖులను మోసం చేసిన శిల్పా చౌదరి కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. వారిని విచారణ కోసం కస్టడీకి అప్పగించాలని పోలీసులు వేసిన పిటీషన్ పై రాజేంద్ర నగర్ కోర్టులో విచారణ జరగనుంది. శిల్పా దంపతులను పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు తమ పిటీషన్ లో పేర్కొన్నారు. దాదాపు 100 కోట్లకు పైగానే శిల్పా చౌదరి కొందరిని మోసం చేసినట్లు పోలీసులకు సమాచారం అందడంతో కస్టడీ కోసం పిటీషన్ వేశారు.
పది రోజుల కస్టడీకి..
శిల్పా చౌదరి దంపతులపై ఇప్పటికే పోలీసులు ఎనిమిది కేసులు నమోదు చేశారు. సంపన్నుల నుంచి తీసుకున్న డబ్బుతో శిల్పా చౌదరి 70 కోట్ల విలువైన విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేశారు. గండిపేట లోని సిగ్నేచర్ విల్లాస్ లో శిల్పా కుటుంబం నివాసముంటుంది. అయితే దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని భావిస్తున్న పోలీసులు బాధితులు ఎవరైనా ఉంటే వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.
Next Story