Thu Dec 26 2024 17:20:29 GMT+0000 (Coordinated Universal Time)
డ్రగ్స్ కంట్రోల్ కు రెండు వింగ్ లు
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో డ్రగ్స్ నియంత్రణకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. రెండు స్పెషల్ వింగ్ లను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ నియంత్రణకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఇందుకోసం రెండు స్పెషల్ వింగ్ లను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ రెండు వింగ్ లు డ్రగ్స్ నియంత్రణకు పనిచేస్తాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ నెల 9వ తేదీన ఈ రెండు వింగ్ లను డీజీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించనున్నారు.
ప్రత్యేకంగా....
హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ను ఒకటి ఏర్పాటు చేస్తారు. ఈ విభాగంలో డీసీపీ ఒకరు, ఇన్స్పెక్టర్లు ఇద్దరు, నలుగురు ఎస్ఐలు, ఇరవై మంది కానిస్టేబుళ్లు ఉంటారు. ఈ విభాగం డ్రగ్ ట్రాఫికింగ్ గ్రూపులు, సప్లయర్స్, పెడ్లర్స్, కస్టమర్లను గుర్తిస్తుంది. నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ సూపర్ విజన్ వింగ్ కూడా అందుబాటులోకి తేనున్నాు. ఇందులో ఒక ఏసీీపీ, ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ, ఆరుగురు కానిసట్టేబుళ్లు ఉంటారు. ఈ రెండు వింగ్ లను స్థానిక పోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేయనున్నారు.
Next Story