Mon Dec 23 2024 13:41:58 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీధర్ రావుపై లుక్ అవుట్ నోటీసులు
సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు
సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులకు ఈ నోటీసులు పంపారు. వారం రోజుల నుంచి శ్రీధర్ రావు పోలీసులకు కన్పించకుండా పోయారు. పోలీసులు ఇచ్చిన నోటీసులకు కూడా స్పందించడం లేదు. హైకోర్టు శ్రీధర్ రావుకు బెయిల్ ఇచ్చినా పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాలను...
కానీ హైకోర్టు ఆదేశాలను కూడా శ్రీధర్ రావు పట్టించుకోవడం లేదు. శ్రీధర్ రావుపై సొమ్ములు ఎగవేసిన కేసులతో పాటు రేప్ కేసు కూడా నమోదయింది. పోలీసులు శ్రీధర్ రావుపై లుక్ అవుట్ నోటీసులు చేసి ఆయన కోసం బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story