Wed Apr 02 2025 14:11:27 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : అఫ్జల్ గంజ్ పోలీసుల కేసుల్లో పురోగతి.. స్కూటర్ స్వాధీనం
అఫ్జల్ గంజ్ కాల్పుల కేసులో కొంత పురోగతిని పోలీసులు సాధించారు.

అఫ్జల్ గంజ్ కాల్పుల కేసులో కొంత పురోగతిని పోలీసులు సాధించారు. కాల్పులు జరిపిన దుండగులు హైదరాబాద్ నుంచి టూ వీలర్ పైనేనే బీదర్ వెళ్లి అక్కడ దోపిడీకి పాల్పడ్డారని తెలిసింది. తర్వాత బీదర్ నుంచి నుంచి అదే ద్విచక్ర వాహనంపై హైదరాబదాద్ కు వచ్చారు. టూ వీలర్ ను హైదరాబాద్ శివారులోలో దొంగిలించినట్లు నిర్ధారించారు. హైదరాబాద్ నుంచి రాయపూర్ వెళ్లే ప్రయత్నంలో టూ వీలర్ ను ఎంజీబీఎస్ లో ఉంచారు.
నాలుగు రాష్ట్రాలు...
హైదరాబాద్ నుంచి రాయపూర్ వెళ్లే క్రమంలోనే ప్రయివేటు ట్రావెల్స్ లో దుండగులు కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఎంజీబీస్ బస్టాండ్ పార్కింగ్ ఏరియాలో దుండగులు ఉంచిన టూ వీలర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే కాల్పులు జరిపిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి ఎటు వెళ్లారన్న దానిపై విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఛత్తీస్ గఢ్, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా పోలీసులు వీరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Next Story