Mon Dec 23 2024 06:56:48 GMT+0000 (Coordinated Universal Time)
రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్యపై కేసు నమోదు
వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. భూ కబ్జా కేసును నమోదు చేశారు
వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. భూ కబ్జా కేసును నమోదు చేశారు. హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదయింది. రవీందర్ రెడ్డి అనే వ్యక్తి తన భూమిని లాక్కుని ఆర్.కృష్ణయ్య తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్ కు చెందిన రవీందర్ రెడ్డి ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించి కోర్టు ఆదేశాలతోనే కేసు నమోదు చేయించారు.
భూ కబ్బా కేసు.....
ఆర్. కృష్ణయ్య బీసీ సంఘం నేతగా సుపరిచితుడు. ఏపీ నుంచి వైసీపీ తరుపున రాజ్యసభ సభ్యుడిగా ఈరోజే ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికయిన రోజునే కేసు నమోదు కావడం విశేషం. రవీందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆర్.కృష్ణయ్యతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. కొందరిని తనను చంపేందుకు పంపారని, తన భూమిని కబ్జా చేయడమే కాకుండా హత్యకు కుట్ర పన్నారని ఆర్. కృష్ణయ్యపై రవీందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
Next Story