Sun Dec 22 2024 21:53:30 GMT+0000 (Coordinated Universal Time)
పబ్ కేసులో 148 మందికి నోటీసులు
ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. డ్రగ్స్ ను వినియోగించిందెవరన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు
ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. డ్రగ్స్ ను వినియోగించిందెవరన్న దానిపై పోలీసులు విచారణ ప్రారంభించనున్నారు. ఆరోజు పబ్ కు వచ్చిన 148 మందికి నోటీసులు పంపాలని నిర్ణయించారు. సోమవారం నుంచి వీరిని విచారించే అవకాశముంది. ఆరోజు పోలీసుల దాడుల్లో కొకైన్ ప్యాకెట్లు దొరికిన సంగతి తెలిసిందే. అయితే కొకైన్ వినియోగంలో పబ్ నిర్వాహకుడు అభిషేక్ పాత్ర ఉందని పోలీసులు నమ్ముతున్నారు.
కొకైన్ వినియోగంపై....
కొకైన్ ను ఈ పబ్ లో ఆరోజు పది నుంచి ఇరవై మంది వరకూ వినియోగించారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే 148 మంది వరకూ పబ్ కు ఆరోజు రావడంతో ఎవరు కొకైన్ ను వినియోగించారన్న దానిపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.
Next Story