Mon Dec 23 2024 09:17:13 GMT+0000 (Coordinated Universal Time)
బాలిక గ్యాంగ్ రేపు కేసులో...?
బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు వేగం పెంచారు. బాధిత బాలిక స్టేట్ మెంట్ పోలీసులు రికార్డు చేయాలని నిర్ణయించారు.
ఆమ్నేషియా పబ్ వద్ద బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు వేగం పెంచారు. బాధిత బాలిక స్టేట్ మెంట్ పోలీసులు రికార్డు చేయాలని నిర్ణయించారు. స్టేట్ మెంట్ ఆధారంగా ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదు చేయనున్నారు. ఎమ్మెల్యే కొడుకు కేసులో ఎ6 గా నమోదు చేసే అవకాశముంది.
పోక్సో చట్ట ప్రకారం....
సోషల్ మీడియాలో బయటకు వచ్చిన వీడియోల ఆధారంగా బాలిక స్టేట్ మెంట్ తీసుకుని లీగల్ ఒపీనియన్ ను పోలీసులు తీసుకుంటారు. పోక్సో చట్ట ప్రకారం బాధితురాలి స్టేట్ మెంట్ ఫైనల్ అని చెబుతున్నారు. మరోవైపు తమకు లభించిన ఇన్నోవా కారు నుంచి కూడా క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించారు. మరికొన్ని ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నారు.
Next Story