Thu Dec 26 2024 17:36:09 GMT+0000 (Coordinated Universal Time)
ఇంతకీ పబ్ లో డ్రగ్స్ వాడిందెవరు?
బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్ లో జరిగిన పార్టీపై పోలీసులు సీరియస్ గా దృష్టి పెట్టారు.
బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్ లో జరిగిన పార్టీపై పోలీసులు సీరియస్ గా దృష్టి పెట్టారు. ఈ పార్టీలో డ్రగ్స్ ను వినియోగించిన వారెవరు అన్న దానిపై విచారణ ప్రారంభించారు. సాంకేతక ఆధారాలపై ఫోకస్ ను పెంచారు. పబ్ కు హాజరయిన వారంతా బర్త్ డే పార్టీకి వచ్చామని చెప్పడంతో బర్త్ డే పార్టీ ఎవరదన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫుడ్ మింక్ పబ్ లో అరెస్ట్ అయిన నిందితులను విచారించడానికి సిద్ధమయ్యారు.
కస్టడీకి అప్పగించాలని.....
నిందితులను పోలీసు కస్టడీకి అప్పగించాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటీషన్ దాఖలు చేయనున్నారు. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న కిరణ్ రాజు, అర్జున్ లు పరారీలో ఉన్నారు. వారికోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలను చేపట్టారు. పోలీసు కస్టడీలో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశముందని, డ్రగ్స్ వాడిని నిందితులను పట్టుకోవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Next Story