Thu Apr 24 2025 04:36:35 GMT+0000 (Coordinated Universal Time)
ముక్కుపుడకే హంతకుడిని పట్టించి... కటకటాల వెనక్కు నెట్టిందిగా
ఢిల్లీలో భార్యను చంపిన కేసులో భర్త అసలు నిందితుడిగా పోలీసులు గుర్తించారు

ఢిల్లీలో భార్యను చంపిన కేసులో భర్త అసలు నిందితుడిగా పోలీసులు గుర్తించారు. నెల రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఈ కేసులో పోలీసులు మిస్టరనీ ఛేదించారు. ఈ కేసులో భార్యను చంపి మురికికాల్వలో పడేసింది భర్తేనని పోలీసులు తేల్చారు. అయితే ఈ కేసులో మహిళకు ఉన్న ముక్కుపుడక కీలకమైన ఆధారంగా పోలీసులకు సాయం చేసింది. భర్త అనిల్ కుమార్ హంతకుడని ముక్కుపుడక పట్టించింది. దీంతో పోలీసులు అతనని అదుపులోకి తీసుకుని విచారించి హత్యకు గల కారణాలను తెలుసుకున్నారు.
మృతదేహాన్ని మురికి కాల్వలో...
మార్చి 15వ తేదీన ఒక మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి దానికి రాయి కట్టి మురికికాల్వలో పడేశారు. అయితే ఆమె ముక్కుపుడక ఆధారంగా మరణించింది మహిళ అని గుర్తించిన పోలీసులు ముక్కుపుడకను కొనుగోలు చేసిన దుకాణానికి వెళ్లి ఇంటి అడ్రస్ ను సేకరించారు. గురుగ్రామ్ లో ఉన్న ఫామ్ హౌస్ లో నివసించే ఢిల్లీకి చెందిన వ్యాపారి అనిల్ కుమార్ ఈ ముక్కుపుడకను కొనుగోలు చేసినట్లు గుర్తించిన పోలీసులు మరణించిన మహిళ అతిని భార్యగా గుర్తించారు. బంధువులకు కూడా తన భార్య సీమా జైపూర్ లో ఉందని, మాట్లాడే పరిస్థితుల్లో లేదని నమ్మబలికాడు. అయితే మహిళ బంధువులను పిలిచి విచారించిన పోలీసులు ఆమెను భర్త అనిల్ కుమార్ హత్య చేశాడని నిర్ధారించి అతనని అరెస్ట్ చేశారు. చివరకు ముక్కుపుడక నిందితుడిని పట్టించినట్లయింది.
Next Story