Fri Dec 20 2024 01:32:22 GMT+0000 (Coordinated Universal Time)
పోలీసులపైకి కుక్కల్ని వదిలిన డ్రగ్స్ ముఠా.. పలువురికి గాయాలు
డార్క్ నెట్ వెబ్ ద్వారా డ్రగ్స్ ను అక్రమంగా రవాణా చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ముఠా పై దాడి చేసి..
అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్న హైదరాబాద్ లో.. నేరాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. వాటిలో డ్రగ్స్ దందా ఒకటి. హైదరాబాద్ అడ్డాగా డ్రగ్స్ దందా కొనసాగుతోంది. పోలీసులు ఎంత నిఘా ఉంచినా.. డ్రగ్స్ తరలింపులు మాత్రం ఆగట్లేదు. చదువుకున్నవారే డ్రగ్స్ దందాలకు పాల్పడటం ఆందోళనకు గురిచేస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ చేతులు మార్చేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఆన్ లైన్ లో డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ ముఠాపై దాడి చేసేందుకు యత్నించారు. పోలీసుల రాకను పసిగట్టిన ముఠా.. వారిపైకి ఏకంగా 100 కుక్కలను వదిలారు. కుక్కల దాడిలో చాలామందికి పోలీసులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
డార్క్ నెట్ వెబ్ ద్వారా డ్రగ్స్ ను అక్రమంగా రవాణా చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ముఠా పై దాడి చేసి ఇద్దరు సప్లైయర్స్, ఆరుగురు పెడ్లర్స్ లను అరెస్ట్ చేశారు. ఈ దందాలో కీలక నేత అయిన నరేందర్ నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా నుంచి 9 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ముఠాలో మిగతా సభ్యులను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. పోలీసులపైకి 100 కుక్కలను వదిలారు. కుక్కల దాడి పలువురు పోలీసులకు తీవ్రగాయాలవ్వగా.. వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలయాల్సి ఉంది.
Next Story