Mon Dec 23 2024 14:52:30 GMT+0000 (Coordinated Universal Time)
తల లేకుండా యువతి శరీరం.. అందరూ హడల్
చనిపోయిన యువతి వయసు 20-22 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తూ ఉన్నారు.
తెల్లవారుజామున మీరట్‌లోని లఖిపురా ప్రాంతంలో రోడ్డుపై పడి ఉన్న శవాన్ని చూసి అందరూ హడలిపోయారు. బాలిక తల నరికివేయబడింది. కేవలం మొండెం మాత్రమే అక్కడ ఉంది. చనిపోయిన యువతి వయసు 20-22 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తూ ఉన్నారు. బాధితురాలిని గుర్తించడానికి పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన లిసరి గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రాథమిక విచారణ ఆధారంగా, యువతిని మరొకచోట చంపిన తర్వాత మృతదేహాన్ని ఆ ప్రాంతంలో విసిరినట్లు తెలిసింది. చుట్టుపక్కల ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.
సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఫోరెన్సిక్ బృందాన్ని కూడా సంఘటనా స్థలానికి రప్పించారు. బాలిక తల ఇంకా లభ్యం కాలేదు. తప్పిపోయిన అమ్మాయిల సమాచారాన్ని అన్ని పోలీస్ స్టేషన్ల నుండి పోలీసులు సేకరిస్తూ ఉన్నారు. పరిసరాల్లోని అన్ని సిసిటివి ఫుటేజీలను పరిశీలిస్తూ ఉన్నారు. పలు కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
News Summary - Police launch probe after beheaded body of girl found in Meerut’s Lakhipura
Next Story