Sat Dec 21 2024 15:34:57 GMT+0000 (Coordinated Universal Time)
పేకాట డెన్ పై పోలీసుల దాడులు
హైదరాబాద్ లో పేకాట డెన్ పై పోలీసులు దాడులు చేశారు. అయ్యప్ప సొసైటీలో ఈ దాడులు నిర్వహించారు
హైదరాబాద్ లో పేకాట డెన్ పై పోలీసులు దాడులు చేశారు. అయ్యప్ప సొసైటీలో ఈ దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖులు పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో ఈ దాడులు నిర్వహించారు. ఎనిమిది మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు.
90 లక్షలు స్వాధీనం...
వీరి వద్ద నుంచి 90 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అయ్యప్ప సొసైటీలో తరచూ పేకాట శిబిరాలను నిర్వహిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించగా ప్రముఖులు ఉన్నట్లు బయటపడింది. అయ్యప్ప సొసైటీలో ఉన్న ఒక ఫ్లాట్ లో ఈ పేకాటను నిర్వహిస్తున్నారు.
Next Story