Wed Dec 25 2024 17:20:32 GMT+0000 (Coordinated Universal Time)
లిటిల్ ఇడ్లీలో డ్రగ్స్.. ఇద్దరి అరెస్ట్
లిటిల్ ఇడ్లీ హోటల్ పై పోలీసులు దాడులు జరిపారు. దాడి చేసి హోటల్ నుంచి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
లిటిల్ ఇడ్లీ హోటల్ పై పోలీసులు దాడులు జరిపారు. అందిన సమాచారంతో పోలీసులు దాడి చేసి హోటల్ నుంచి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి పదకొండు గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఇంకా కొంత డ్రగ్స్ కు సంబంధించిన ముడిసరుకును, ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు.
హోటల్ యజమానులను...
పోలీసులు దాడి చేసి లిటిల్ ఇడ్లీ యజమానులు సాయిశరత్, నిశవ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముంబయి నుంచి డ్రగ్స్ ను కొనుగోలు చేసి హైదరాబాద్ కు తీసుకు వచ్చి సాయిశరత్ ఇక్కడ విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఎవరెవరికి డ్రగ్స్ విక్రయించారన్న దానిపై విచారణను జరుపుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story