Mon Dec 23 2024 05:17:17 GMT+0000 (Coordinated Universal Time)
గుర్రపుస్వారీ బెట్టింగ్ స్థావరంపై పోలీసు దాడులు
రాజేంద్రనగర్ గుర్రపు స్వారీ బెట్టింగ్ స్థావరం పై పోలీసుల దాడులు నిర్వహించారు
రాజేంద్రనగర్ గుర్రపు స్వారీ బెట్టింగ్ స్థావరం పై పోలీసుల దాడులు నిర్వహించారు. తేజస్వీ నగర్ కాలనీ లోని ఓ ఇంటి పైపోలీసులు దాడులు చేశారు. ఆన్ లైన్ లో గుర్రపు స్వారీ బెట్టింగ్ నిర్వహిస్తుండగా 13 మందిని రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి యాభై వేల రూపాయల నగదు, 17 మొబైల్ ఫోన్లు, 19 డెబిట్, క్రెడిట్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక కారును కూడా ఈ సందర్భంగా పోలీసులు సీజ్ చేశారు.
13 మంది అరెస్ట్....
అందిన సమాచారం మేరకు అపార్ట్మెంట్ లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారని తెలిసి పోలీసులు ఈ దాడులు జరిపారు. పోలీసులను చసి పారిపోయే ప్రయత్నం చేసినా పదమూడు మందిని అదుపులోకి తీసుకున్నారు. గుర్రపు స్వారీ సమాచారాన్ని వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసి తిరుమలరెడ్డి అనే యువకుడు పోస్టు చేస్తున్నారు. ఆర్ఎస్ వరల్డ్ అనే గ్రూప్ ద్వారా గుర్రపు స్వారీ బెట్టింగ్ ను నిర్వహిస్తున్నాడు. ఈ పదమూడు మందిపై గేమింగ్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వీరంతా బడా వ్యాపారులుగా గుర్తించారు. దాదాపు ఏడాది నుంచి ఈ బెట్టింగ్ దందాను నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story